ETV Bharat / state

ఆగినోళ్ల యాతన.. అయినోళ్ల వేదన - The difficulties of anathapur migrants

కొవిడ్‌-19తో వలస జీవులు విలవిల్లాడిపోతున్నారు. కరవు.. తట్టాబుట్టతో ఇతర ప్రాంతాలకు సాగనంపింది. కరోనా కసిరిన వేళ ఉపాధికి తాళం పడింది. జనజీవనం స్తంభించింది. ఆకలి మంటలకు తెరలేపింది. సొంతూరికి రాలేక ఎక్కడెక్కడో ఆగినోళ్ల యాతన.. పల్లెల్లో అయినోళ్లనూ కంటతడి పెట్టిస్తున్న దయనీయమిది.

anathapur district
ఆగినోళ్ల యాతన.. అయినోళ్ల వేదన
author img

By

Published : Apr 10, 2020, 1:58 PM IST

అనంతపురం జిల్లా కదిరి ప్రాంత ప్రజలు ప్రధానంగా బెంగళూరులో ఉపాధి పొందుతున్నారు. 60 శాతం మంది ఇళ్లకు చేరుకోగా 30 నుంచి 40 శాతం మంది అక్కడే ఉన్నారు. ఎలక్ట్రానిక్‌ సిటీ, దొడ్డతోగూరు, చిన్నతోగూరు, దొడ్లమంగళ, బసపుర, ఓఫారం, వడ్రపాళ్య, ప్రగతి నగర్‌, సికారి పాళ్యంలో ఇప్పటికీ సుమారు నాలుగైదు వేల మంది జీవనం గడవక బిక్కుబిక్కుమంటున్నారు. పనుల్లేక, కూలీ సొమ్ము చేతికందని దీనావస్థ. బయటకొస్తే బడితె పూజ... ఇంట్లో ఉంటే ఆకలి బాధతో అలమటిస్తున్నారు. పాలకులు, అధికారులు స్పందించి పూట గడిచేలా భృతి కల్పించాలనీ, లేదంటే సొంతూరు పంపాలని వేడుకుంటున్నారు.

తిండి దొరకని దైన్యం

కర్ణాటక ప్రభుత్వం పాలు, నిత్యావసరాలు ఇస్తున్నా తమ దరి చేరడం లేదని వాపోతున్నారు. మీలాంటి వారితోనే మాకీ ముప్ఫు.. మీ ఊళ్లకు వెళ్లండనే చీవాట్లు తప్పడం లేదని వాపోతున్నారు. సొంతూళ్ల నుంచి తెచ్చుకున్న నిత్యావసరాల సర్దుబాటుతో సుమారు 20 రోజులు గడిపేశాం. ఇకపై ఆకలి తీరిదే కష్టమేనని బావురుమంటున్నారు. అద్దె చెల్లించక పోతే ఇళ్లలో ఉండనివ్వరనే భయాందోళనా మొదలైంది. లాక్‌డౌన్‌ మరింత పొడిగిస్తారని వింటేనే భయమేస్తోందని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క నీళ్లడబ్బా రూ.80

ఒక వాటర్‌ వ్యాన్‌ రూ.80 అమ్ముతున్నారు. పాలు, ఇతర సరకులు ఉచితంగా ఇస్తున్నా ఆంధ్రవాళ్లకు ఇవ్వమంటున్నారని వలస కూలీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊరికి వచ్చేద్దామని బాగేపల్లి చెక్‌పోస్టు వరకు వచ్చినా ముందుకు పోనివ్వక పోవటంతో బెంగళూరుకే వచ్చేశామని ఓ బాలప్పగారిపల్లి చెందిన వలసకూలీ వాపోయారు.

ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం

'కూలీతో గడిపే మాకు పనుల్లేక పూట గడిచేది కష్టంగా ఉంది.. నా భార్యకు గర్భసంచి, కిడ్నీ ఆపరేషన్‌ చేయించా. ఆసుపత్రికి వెళ్లాలి. బయటకెళ్లాలంటే కుదరదు. ఇంట్లో ఉంటే తిండికి లేదు. వైరస్‌ ఏం చేస్తుందో తెలియదు. ఈ పరిస్థితులే మమ్మల్ని చంపేలాగున్నాయి'. - నాగభూషణం, వలసకూలీ

ఆంధ్ర నుంచి వెళ్లి వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలసకూలీలను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

కరోనా కట్టడికి లాక్​డౌన్ కొనసాగింపు​ తప్పనిసరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.