ETV Bharat / state

NARA LOKESH: 'జగన్‌ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు.. విధ్వంసం మాత్రమే ఉంది'

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల విద్యార్థులను కలిసి మాట్లాడారు. ఎయిడెడ్‌ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తును... సీఎం జగన్​ అగమ్యగోచరంగా తయారుచేశారని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

'జగన్‌ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు.. విధ్వంసం మాత్రమే ఉంది'

author img

By

Published : Nov 10, 2021, 2:18 PM IST

'జగన్‌ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు.. విధ్వంసం మాత్రమే ఉంది'

ప్రభుత్వ పథకాలన్నింటికీ జగన్‌ పేరు పెట్టడమేంటని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనంతపురం పర్యటనలో అన్నారు. జగన్‌ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు.. కేవలం విధ్వంసం మాత్రమే నడుస్తోందని విమర్శించారు. ఎయిడెడ్‌ కళాశాల భూములపై సీఎం జగన్‌ కన్నేశారని ఆరోపించారు. ఎయిడెడ్‌ కళాశాల నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు వచ్చారని నారా లోకేశ్ వివరించారు. 2 వేలకు పైగా ఎయిడెడ్‌ పాఠశాలల్లో 2 లక్షల మంది, 182 జూనియర్ కళాశాలల్లో 71 వేల మంది విద్యార్థులున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎయిడెడ్‌ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వంపై విద్యార్థుల ఆగ్రహం

అందరికీ ఉచిత విద్య అంటూ సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏమైందని ముఖ్యమంత్రిని.. విద్యార్థులు నిలదీశారు. లోకేశ్‌తో ముఖాముఖి సందర్భంగా మాట్లాడిన విద్యార్థులు..విద్యను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రైవేటుపరం చేస్తే వేలకు వేలు ఫీజులు ఎలా కట్టాలని ప్రశ్నించారు.

దాడి చేసినవారిని శిక్షించాలి: రామకృష్ణ

అనంతపురం దాడి ఘటనను సీఎం ఖండిస్తారా? లేదా? లేదా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. విద్యార్థులపై దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. విద్యార్థులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో 2.35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో సీఎం జగన్ విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పోలీసులు ఫోన్లు చేసి బెదిరించడం సబబు కాదని తెలిపారు. ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యా సంస్థల రద్దు జీవోను ఉపసంహరించుకోవాలని సూచించారు. ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని రామకృష్ణ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పయ్యావుల కేశవ్, కాలవ శ్రీనివాసులు, పరిటాల శ్రీరామ్ హాజరయ్యారు. వీరితోపాటుగా పలు విద్యార్థి సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

LIVE VIDEO : బట్టల షాప్​కెళ్లిన పల్సర్​ బైక్​.. అసలేం జరిగిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.