అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి తెప్పోత్సవం నయనానందకరంగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత నరసింహుడు ప్రత్యేక పల్లకిలో పుర వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి అర్చకులు పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
అనంతరం స్వామివారి తెప్పొత్సవం నిర్వహించారు. శాసన సభ్యుడు సిద్ధారెడ్డి, ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మకు సారె సమర్పించిన అనంతరం చెరువులో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు.