SCHOOL MERZ: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తమ ఊర్లోనే ఉంచాలంటూ.. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం మాముడూరు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. మాముడూరు గ్రామంలోని పాఠశాలను.. వెంకటాపురంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేసినట్లు ఉత్తర్వులు వచ్చాయి.
ఆ విషయం తెలుసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు గ్రామంలో నిరసన ర్యాలీ చేపట్టారు. మాకు మా ఊరు స్కూలే ముద్దు.. పొరుగురు స్కూలు వద్దే వద్దు అని నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళాలు వేసి ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: