Man Suspect Death in Police Station: నేరం చేశారని ఆ ఇద్దరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. రాత్రి సమయంలో ఏమైందేమో అందులో ఒకరు చనిపోయారు. ఈ ఘటన అనంతరం జిల్లా రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. రాత్రి జరిగిన విషయం ఉదయం బయటి ప్రపంచానికి తెలిసింది. అతని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద స్థితి మృతి: రాయదుర్గంలో గొర్రెల దొంగతనం జరిగింది. దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారిద్దరినీ గొర్రెల అపహరణ కేసులో పోలీసు స్టేషన్‌కు తరలించి అక్కడే ఉంచారు. రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్లో ఒకరు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఈ మృతిని ఎవ్వరికీ తెలియకుండా చేయడానికి.. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించారు. తెల్లారేసరికి విషయం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఈ సంఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎలా చనిపోయాడని యక్ష ప్రశ్నలు తలెత్తున్నాయి. మృతుడు రామాంజనేయులు ఆత్మకూరు మండలం సనప గ్రామ వాసి అని తేలింది.
అసలేం జరిగింది: సోమవారం వేకువజామున రాయదుర్గం పట్టణంలోని పైతోటలో ఇద్దరు దొంగలు బొలెరో వాహనంలో గొర్రెలను ఎత్తుకెళ్లడానికి వచ్చారు. స్థానికులు గమనించి వారిద్దరిని పట్టుకుని చితకబాదారు. వారు చేసిన తప్పు ఒప్పుకోవడంతో పోలీసులకు అప్పగించారు. వారిని పీఎస్‌కు తరలించారు. గతంలోనూ జరిగిన గొర్రెల దొంగతనం బృందం ఇదేనని అనుమానిస్తున్నారు.
పోలీసులపై వేటు: పీఎస్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతిపై ఎస్పీ ఫక్కీరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. రాయదుర్గం పట్టణ సీఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు మధుబాబు, గంగన్న, హోంగార్డు రమేష్‌లను ఎస్పీ సస్పెండ్ చేశారు.
రాయదుర్గంలో గొర్రెల దొంగతనం జరగడంతో ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని సోమవారం అప్పగించారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈరోజు రిమాండ్‌కు పంపవలసి ఉంది. రామాంజనేయులు అలియాస్ అంజి, శ్రీనివాసులు ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందినారు. రామాంజనేయులపై దాదాపు 15 గొర్రెల దొంగతనం కేసులు ఉన్నాయి. ఆత్మకూరు స్టేషన్లో సస్పెక్టివ్ షీటు ఓపెన్ ఉంది. రామాంజనేయుులు అతని లుంగీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉండటంతో అక్కడ ఉన్నవారు కేకలు వేయడంతో సిబ్బంది అప్రమత్తమై అసుపత్రికి తీసుకెళ్లారు. చనిపోవడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేశాము. డ్యూటీలో ఉన్నవారి నిర్లక్ష్యం కారణంగానే జరిగింది కాబట్టి ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సీఐ శ్రీనివాసులు, హోంగార్డు రమేష్, ఇద్దరు కానిస్టేబుళ్లు మధుబాబు, గంగన్నలను సస్పెండ్ చేశాము. -శ్రీనివాసులు, కళ్యాణదుర్గం డీఎస్పీ
ఇవీ చదవండి