అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో హంద్రీనీవా సుజల స్రవంతి పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు రెండు చోట్ల గండి పడింది. చెర్లోపల్లి జలాశయం నుంచి దిగువ ప్రాంతమైన చిత్తూరు జిల్లాకు ఇటీవల అధికారులు నీటిని విడుదల చేశారు. ఫలితంగా.. కాలువలో నీటి ఉద్ధృతి ఎక్కువైంది.
తనకల్లు మండలంలోని సింగిరివాండ్ల పల్లి వద్ద రెండు రోజుల కిందట కాలువకు గండి పడగా... ఇదే మండలంలోని బాల సముద్రం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కి గండి కొట్టారు. ఈ కారణంగా.. భారీగా కృష్ణా జలాలు వృథా అవుతున్నాయి. అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: