అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంట గ్రామంలో కొండముచ్చును అటవీశాఖ అధికారులు(gibbon catch by forest staff) బంధించారు. ముప్పలకుంట గ్రామంలో కొద్దిరోజులుగా ఓ కొండముచ్చు తెగ అల్లరి చేస్తోంది. గ్రామంలోని ప్రజలందరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇదే విషయాన్ని గ్రామస్థులంతా కలిసి అటవీశాఖ అధికారులకు తెలిపారు. ఎలాగైనా కొండముచ్చును పట్టుకుని తమను రక్షించాలని కోరారు. కొండముచ్చు గురించి తమకు అందిన ఫిర్యాదు మేరకు శనివారం ఉదయం అటవీ అధికారులు గ్రామంలో బోను ఏర్పాటు చేశారు. కొండముచ్చను బంధించారు. బంధించిన కొండముచ్చుకు రెండున్నరేళ్ల వయసు ఉంటుందని కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో వదిలి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : వికటించిన ఆర్ఎంపీ వైద్యం..ఆ తర్వాత ఏం చేశాడంటే..!