ETV Bharat / state

'కొవిడ్​ నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటాం'

కర్ఫ్యూ నిబంధనలు తప్పక పాటించాలని అనంతపురం జిల్లా కదిరి డీఎస్పీ భవ్య కిషోర్ అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

curfew at ananthapur district kadhiri
curfew at ananthapur district kadhiri
author img

By

Published : Jun 16, 2021, 9:39 AM IST

కొవిడ్​ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా కదిరి డీఎస్పీ భవ్య కిషోర్ హెచ్చరించారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో కొంతమంది అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారని అన్నారు. సాయంకాలపు నడక పేరుతో పట్టణ పరిసరాల్లో పెద్దసంఖ్యలో జనం గుమిగూడుతూ కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు.

కదిరి సబ్ డివిజన్ వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి రూ.24.38 లక్షల జరిమానా వసూలు చేసినట్లు డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు. మొత్తం 21,183 కేసుల నమోదు చేసినట్లు వెల్లడించారు. కర్ఫ్యూ వేళల్లో అనవసరంగా బయటకు వచ్చిన 337 ద్విచక్ర వాహనాలు, 34 ఆటోలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. కర్ఫ్యూ నిబంధనలు తప్పక పాటించాలని డీఎస్పీ సూచించారు.

ఇదీ చదవండి:

ప్రొద్దుటూరులో దారుణం: బావను చంపిన బావమరిది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.