ETV Bharat / state

చమురు ధరల పెంపుపై లారీ యజమానుల నిరనస.. టమాటా రైతులకు ఇబ్బందులు - అనంతపురంలో టమాట రైతుల నిరసన న్యూస్

డీజిల్ ధరలు పెరగడంతో తమకు గిట్టుబాటు కాదని లారీ యజమానులు ఆందోళనకు దిగారు. ఇదీ కాస్త టమాటా రైతులకు శాపంగా మారింది. మార్కెట్ యార్డు నుంచి ఇతర ప్రాంతాలుకు టమాటా బాక్సులను తరలించేందుకు లారీ యజమానులు నిరాకరించడంతో.. రైతులు సైతం నిరసనకు దిగారు. ఈ ఘటన అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం వద్ద జరిగింది.

Concern of lorry owners and tomato farmers in Kalyanadurgm, Anantapur district
లారీ యజమానులు.. టమాటా రైతులు.. విడివిడిగా నిరసనలు
author img

By

Published : Feb 21, 2021, 5:27 PM IST

డీజిల్ ధరలు పెరగడంపై.. అనంతపురం జిల్లాలోని లారీ యజమానులు ఆందోళనకు దిగారు. కళ్యాణదుర్గం టమాటా మార్కెట్​కు రైతులు తీసుకొచ్చిన టమాటా బాక్సులను ఇతర ప్రాంతాలకు తరలించాలని లారీ యజమానులను కోరారు. అందుకు వారు నిరాకరించారు.

రైతులు సైతం నిరసన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వారికి సర్ధి చెప్పారు. రైతుల పంటను తరలించిన అనంతరం ఆందోళన చేపట్టాలని లారీ యజమానులను కోరగా.. వారు అంగీకరించారు. పంటను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అంగీకరించారు.

ఇదీ చదవండి:

పది ఎకరాల పప్పు శెనగ దగ్ధం.. రూ.ఆరు లక్షల నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.