అనంతపురం జిల్లా కంబదూరు మండలం అండేపల్లి సమీపంలోని కొండ వెనుకవైపు ఓ చిరుత మృతి చెందింది. చిరుత మృతి చెందిన ఈ ప్రాంతాన్ని స్థానిక పోలీసులు, అటవీ శాఖ అధికారులు పరిశీలించారు.
పంచనామా చేయించి ఖననానికి సన్నాహాలు చేస్తున్నారు. ఘటనకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. వేటగాళ్లు ఎవరైనా చంపారా? విషప్రయోగం జరిగిందా.. అన్న కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: