అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కొన్ని రోజులుగా ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ ఇవాళ పరీక్షల ఆపేయడంతో చాలా మంది ఆస్పత్రికి వచ్చి వెళ్తున్నారు. కొంతమంది అత్యవసర పరిస్థితుల్లో వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కరోనా పరీక్షలు లేకపోవడంతో కొంతమంది నేలపైనే నిరీక్షిస్తున్నారు. మరికొందరు కరోనా బాధితులు పడకలు లేక నేలపైన సేద తీరుతున్నారు. రోజు రోజుకి కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆస్పత్రుల్లో వసతులు కల్పించాలని, జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: రైతు భరోసా ద్వారా అరకోటి మంది రైతులకు లబ్ధి'