ETV Bharat / state

'కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు' - corona cases at ananthpaur

అనంతపురం జిల్లా కదిరిలో కర్ఫ్యూ అమలును ఎస్పీ సత్య ఏసుబాబు పరిశీలించారు. ప్రధాన రహదారుల్లో వాహనాల, ప్రజల రాకపోకలు, వ్యాపార సముదాయాల కార్యకలాపాలను గమనించారు. కూరగాయల మార్కెట్​ను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనవసరంగా రహదారులపైకి వచ్చే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ananthapur sp observe kurfew at kadhiri
ananthapur sp observe kurfew at kadhiri
author img

By

Published : May 28, 2021, 7:51 AM IST

కొవిడ్‌ కట్టడికి కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు అనంతపురం జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం కదిరిలో కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించారు. ప్రధాన రహదారులతో పాటు కూరగాయల మార్కెట్‌ను పరిశీలించారు. కర్ఫ్యూను మరికొన్ని రోజులు పాటిస్తే మహమ్మారిని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు.

కర్ఫ్యూ సడలింపు సమయంలోనూ సామాజిక దూరం, మాస్కు ధరించడం తప్పనిసరన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుంటున్నట్లు ఎస్పీ చెప్పారు. కర్ఫ్యూ పటిష్ట అమలుకు అధికారులు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఇందుకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కర్ఫ్యూ సమయంలో దుకాణాలు తెరిస్తే కేసు నమోదు చేసి వారం రోజుల పాటు దుకాణం సీజ్‌ చేస్తామన్నారు. ఆయన వెంట డీఎస్పీ భవ్యకిషోర్‌, సీఐలు శ్రీనివాసులు, నిరంజన్‌రెడ్డి, మధు, ఎస్సై ఉన్నారు.

ఇదీ చదవండి: CM Jagan Review: 'ఫౌండేషనల్ స్కూళ్ల తర్వాత డిజిటల్‌ బోధనపై దృష్టి పెట్టాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.