అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో అంతరాష్ట్ర దొంగల ముఠా(interstate thieves gang).. పోలీసులను ముప్పతిప్పలు పెట్టింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కర్ణాటక నుంచి వస్తున్న లారీని కల్యాణదుర్గం పట్టణంలో పోలీసులు ఆపి తనిఖీ చేయబోగా.. ఆగకుండా వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. లారీని వెంబడించారు. ఈ క్రమంలో కళ్యాణదుర్గం మండలం పరిధిలోని పాలవాయి గ్రామం పంటపొలాల్లో లారీ ఇరుక్కుపోవడంతో దొంగలు(thieves gang escaped at kalyanaduram) అక్కడినుంచి పారిపోయారు.
స్థానిక రైతుల సమాచారంతో ఉదయాన్నే అక్కడకు చేరుకున్న పోలీసులు.. లారీని కల్యాణదుర్గం స్టేషన్‌కు తరలించారు. ఆ వాహనంలో దొంగలు ధరించే వివిధ రకాల దుస్తులు, మారణాయుధాలతోపాటు రెండు ఆవులను గుర్తించారు. రాత్రంతా పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన ముఠా ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఉత్తర భారతదేశానికి చెందిన పశువులను దొంగిలించే ముఠా(interstate cow thieves gang)గా పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న రెండు ఆవుల్లో ఒక దానికి ఇన్సూరెన్స్‌కు సంబంధించిన ట్యాగ్ ఉందని.. దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి..
మూడు తరాలుగా ఒకే వైద్యవృత్తి... అమ్మమ్మ, అమ్మ, మనుమరాలిదీ ఒకే బాట