విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ సిబ్బందిపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణం నాగిరెడ్డిపల్లి వద్ద విద్యుత్ లైన్లను పరిశీలించేందుకు రజనీకాంత్ రెడ్డి, ఒప్పంద ఉద్యోగులు మహేంద్ర, గంగిరెడ్డి, మరో వ్యక్తి వెళ్లారు. 42వ నంబర్ జాతీయ రహదారి పక్కన విద్యుత్ లైన్లు పరిశీలిస్తున్నసమయంలో ..రాయదుర్గం నుంచి చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని అధిగమించే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న వారిపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఒప్పంద ఉద్యోగి మహేంద్ర అక్కడిక్కడే మృతి చెందాడు. ఏఈ రజనీకాంత్ రెడ్డి, తాత్కాలిక ఉద్యోగి గంగిరెడ్డి మరొకరు గాయపడ్డారు. క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాధితులను మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు.
ఇదీ చూడండి. కుమారుడి చికిత్స కోసం దాచిన డబ్బులు.. అగ్నికి ఆహుతి!