Golden Ticket World Cup 2023 : టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar)కు 2023 ప్రపంచకప్ గోల్డెన్ టికెట్ అందింది. ఈ టికెట్‌ను బీసీసీఐ సెక్రటరీ జై షా.. శుక్రవారం స్వయంగా సచిన్‌కు అందజేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. "ఇండియన్ ఐకాన్స్‌కు గోల్డెన్ టికెట్స్ కార్యక్రమంలో భాగంగా, బీసీసీఐ సెక్రటరీ జై షా.. భారతరత్న శ్రీ సచిన్ తెందూల్కర్‌కు టికెట్ అందజేశారు. సచిన్ క్రికెట్ ప్రయాణం ఎన్నో తరాలలో స్పూర్తిని నింపింది. ఇప్పుడు ఆయన ఐసీసీ 2023 వరల్డ్‌కప్ లైవ్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు" అని ట్విట్టర్లో రాసుకొచ్చింది. అయితే ఇదివరకే ఈ గోల్డెన్ టికెట్‌ను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు కూడా అందజేసింది బీసీసీఐ.
-
🏏🇮🇳 An iconic moment for cricket and the nation!
— BCCI (@BCCI) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
As part of our "Golden Ticket for India Icons" programme, BCCI Honorary Secretary @JayShah presented the golden ticket to Bharat Ratna Shri @sachin_rt.
A symbol of cricketing excellence and national pride, Sachin Tendulkar's… pic.twitter.com/qDdN3S1t9q
">🏏🇮🇳 An iconic moment for cricket and the nation!
— BCCI (@BCCI) September 8, 2023
As part of our "Golden Ticket for India Icons" programme, BCCI Honorary Secretary @JayShah presented the golden ticket to Bharat Ratna Shri @sachin_rt.
A symbol of cricketing excellence and national pride, Sachin Tendulkar's… pic.twitter.com/qDdN3S1t9q🏏🇮🇳 An iconic moment for cricket and the nation!
— BCCI (@BCCI) September 8, 2023
As part of our "Golden Ticket for India Icons" programme, BCCI Honorary Secretary @JayShah presented the golden ticket to Bharat Ratna Shri @sachin_rt.
A symbol of cricketing excellence and national pride, Sachin Tendulkar's… pic.twitter.com/qDdN3S1t9q
గోల్డెన్ టికెట్ అంటే ఏంటీ?
What Is Golden Ticket : భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీని విజయవంతంగా నిర్వహించడం కోసం బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. గోల్డెన్ టికెట్ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఈ గోల్డెన్ టికెట్ అందుకున్న వారు, ప్రపంచకప్‌లోని అన్ని మ్యాచ్‌లను స్టేడియంలో ప్రత్యక్షంగా.. వీఐపీ బాక్స్‌లో కూర్చొని వీక్షించవచ్చు. దీంతోపాటు ఈ టికెట్‌పై వారికి వీఐపీ వసతులన్నింటినీ కల్పిస్తారు. అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, సచిన్ తెందూల్కర్ ఇద్దరికి ఈ టికెట్ అందింది. మున్ముందు ఈ గోల్డెన్ టికెట్లను దేశంలోని ఆయా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
-
Golden ticket for our golden icons!
— BCCI (@BCCI) September 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
BCCI Honorary Secretary @JayShah had the privilege of presenting our golden ticket to none other than the "Superstar of the Millennium," Shri @SrBachchan.
A legendary actor and a devoted cricket enthusiast, Shri Bachchan's unwavering support… pic.twitter.com/CKqKTsQG2F
">Golden ticket for our golden icons!
— BCCI (@BCCI) September 5, 2023
BCCI Honorary Secretary @JayShah had the privilege of presenting our golden ticket to none other than the "Superstar of the Millennium," Shri @SrBachchan.
A legendary actor and a devoted cricket enthusiast, Shri Bachchan's unwavering support… pic.twitter.com/CKqKTsQG2FGolden ticket for our golden icons!
— BCCI (@BCCI) September 5, 2023
BCCI Honorary Secretary @JayShah had the privilege of presenting our golden ticket to none other than the "Superstar of the Millennium," Shri @SrBachchan.
A legendary actor and a devoted cricket enthusiast, Shri Bachchan's unwavering support… pic.twitter.com/CKqKTsQG2F
మరో 25 రోజుల్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్ కోసం.. బీసీసీఐ రీసెంట్గా 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. గాయం కారణంగా గత ఆరు నెలల నుంచి ఆటకు దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు జట్టులో చోటు దక్కింది.
Team India Squad For World Cup 2023 : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, జన్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.
ODI World Cup 2023 Hyderabad Schedule : ఉప్పల్ మ్యాచ్ రీ షెడ్యూల్ పై స్పందించిన బీసీసీఐ!
BCCI President Pakistan Visit : పాక్‌కు BCCI బాస్‌లు.. 'నో పాలిటిక్స్.. కేవలం క్రికెట్ కోసమే!'