India Skills-2021 : ఐటీ ప్రపంచంలో భారత్ మేటిగా నిలుస్తోంది. ఎంతోమంది భారతీయులు అంతర్జాతీయ ప్రముఖ దిగ్గజ సంస్థల సీఈవోలుగా రాణిస్తున్నారు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. దేశ యువతను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యానిమేషన్, సిస్టం ఆపరేటింగ్ రంగాల్లో సమర్థులుగా తీర్చిదిద్దేందుకు ఇండియా స్కిల్స్ పోటీలు చక్కడి వేదికగా నిలిచాయి.
ఆకట్టుకున్న యువత..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు నుంచి వచ్చిన యువత.. ఇండియా స్కిల్స్‌లో తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. అతి ముఖ్యమైన డేటా సెక్యూరిటీ విషయాలో వాళ్ల ఆలోచనల్ని పంచుకున్నారు. ఒక ఐటీ సంస్థని నడిపేందుకు కావాల్సిన నైపుణ్యాలు వాళ్లలో ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు... ఈ పోటీల్లో వివిధ స్థాయి పరీక్షలు పెట్టారు. ఐటీలో నిపుణుల సమక్షంలో.. తక్కువ సమయం డేటా స్టోర్, డేటాకు భద్రతను కల్పించడం సహా... డేటా చోరీలు అరికట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలుపై పోటీలు నిర్వహించారు. ప్రస్తుతం ఐటీకి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. మన యువత చక్కడి ప్రతిభ కనబర్చిందని... నిర్వహకులు చెబుతున్నారు.
మీరు ఎంచుకున్న రంగాల్లో మంచి నైపుణ్యాలు సాధిస్తే... నాకు ఉద్యోగం లేదు, ప్రభుత్వాలు ఎలాంటి ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడం లేనని బాధ పడాల్సిన పని లేదు. ఉద్యోగాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ప్రస్తుతం మనదేశానికి ఉద్యోగాలు కోరుకునే వాళ్లు కాదు... ఉద్యోగాలు ఇచ్చే వాళ్లు కావాలి. అందుకు అంతర్జాతీయ స్థాయి వృత్తి నైపుణ్యాలు సాధించాలి. అదే స్కిల్ ఇండియా నినాదం . - ఈశ్వర్ నారాయణ, ఐటీ విభాగ పోటీదారు
రానున్న రోజుల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కు లక్షల కోట్లు వెచ్చించాలేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ తరుణంలో.. యువతలో ఉన్న నూతన ఆలోచనలను వెలికి తీసేందుకు ప్రత్యేక పోటీలు నిర్వహించారు. ఇందులో పాల్గొన యువత.. బ్రిక్ ఇండస్ట్రీని బలోపేతం చేసేలా నిర్మాణాలు చేసి చూపించారు. బ్రిక్ వినియోగం, ప్లాస్టరింగ్, ఫ్లోర్ బిల్డ్ వంటి విభాగంలో నూతన ఆలోచనల్ని ప్రయోగ పూర్వకంగా చేసి చూపించారు. ఆధునిక పోకడలుపోతున్న గృహ నిర్మాణ రంగంలో నైపుణ్యం ఉన్న వారికి మంచి ప్యాకేజీలతో ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా బ్రిక్ వర్క్, ఫ్లోరింగ్, హౌస్ పెయింటింగ్ , వెల్డింగ్ సహా ఎన్నో విభాగంలో ప్రతిభ ఉన్న యువతను గుర్తించేందుకు... నిర్వహకులు విభిన్న పోటీలు నిర్వహించారు.
ఇన్ఫర్మేషన్ , ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లోని పోటీల్లో యువత మంచి ప్రతిభ చూపినట్లు అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం వారు సాధించిన నైపుణ్యాలకు మరికొంచెం మెరుగులు దిద్దుకుంటే... ప్రపంచ నలుమూలల్లో ఎక్కడికి వెళ్లినా రాణిస్తారని భరోసా ఇస్తున్నారు.
ఇదీ చదవండి