ETV Bharat / crime

కృష్ణా నదిలో గల్లంతైన ఐదుగురి మృతదేహాలు లభ్యం.. పోస్టుమార్టం తర్వాత అప్పగింత

author img

By

Published : Dec 17, 2022, 4:54 PM IST

STUDENTS MISSING IN KRISHNA RIVER: యనమలకుదురు సమీపంలోని కృష్ణా నదిలో సరదగా ఈత కొట్టడానికి వచ్చి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న ఇద్దరివి దొరకగా.. మిగతా ముగ్గురు డెడ్​బాడీలను సహాయక బృందాలు నేడు వెలికితీశాయి.

STUDENTS MISSING IN KRISHNA RIVER
STUDENTS MISSING IN KRISHNA RIVER

STUDENTS DEAD BODIES FOUND : కృష్ణా జిల్లా యనమలకుదురు సమీపం కృష్ణానదిలో గల్లంతైన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న కామేష్, గుణశేఖర్ శవాలు లభ్యమవ్వగా ఈరోజు బాలు, బాజి, హుస్సేన్ మృతదేహాలను సహయక బృందాలు వెలికితీశాయి. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వాటిని తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుంటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. చనిపోయిన బిడ్డలను చూసి కుంటుంబసభ్యులు రోధిస్తున్నారు.

అసలేం జరిగిందంటే: కృష్ణా జిల్లా యనమలకుదురు సమీపంలో శుక్రవారం సరదగా ఈతకు దిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతైయ్యారు. గల్లంతైన విద్యార్థుల ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. విజయవాడలోని పటమట దర్శిపేటకు చెందిన మద్దాల బాలు ఇంటర్‌ రెండో ఏడాది, షేక్‌ హుస్సేన్‌ 9వ తరగతి, షేక్‌ ఖాశిం అలీ 7వ తరగతి, పిన్నింటి శ్రీను 9వ తరగతి, ఇనకొల్లు గుణశేఖర్‌ 9వ తరగతి చదువుతున్నారు. తోట కామేష్‌ పదో తరగతి, షేక్‌ బాజీ 8వ తరగతి చదువుతూ మానేశారు. వీరంతా స్నేహితులు.

శుక్రవారం మధ్యాహ్నం యనమలకుదురు వద్ద కృష్ణానదిలో ఈత కొట్టడానికి వెళ్లారు. వీరిలో శ్రీను ఒడ్డునే ఉండిపోయాడు. నీరు ఎక్కువగా ఉన్న చోట ఈత కొడదామని షేక్‌ బాజీ చెప్పడంతో అందరూ చేతులు పట్టుకొని లోపలకు వెళ్లారు. పదడుగులు వేయగానే ఒక్కసారిగా లోతుగా ఉన్న గుంతల్లోకి జారిపోయారు. నీటి ఉరవడి ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయారు. ఒడ్డున ఉన్న శ్రీను భయాందోళనలతో పెద్దగా కేకలు వేయగా స్థానిక మత్స్యకారుడు ఏడుకొండలు అక్కడకు చేరుకుని.. ఖాసింవలిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. గుణశేఖర్‌ (14), కామేష్‌ (15) మృతదేహాలు సాయంత్రం 5.30 సమయంలో లభ్యమయ్యాయి. నేడు మిగతా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.