ETV Bharat / crime

Accident: హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఎంపీటీసీ దంపతుల దుర్మరణం - ఎంపీటీసీ దంపతుల దుర్మరణం

హైదరాబాద్‌ హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్ ఓఆర్‌ఆర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తానేదార్​పల్లి ఎంపీటీసీ దొంతం కవిత, ఆమె భర్త తెరాస నేత వేణుగోపాల్ రెడ్డి  ఈ ఘటనలో మృతి చెందారు.

Accident:
Accident:
author img

By

Published : Sep 1, 2021, 10:53 AM IST

హైదరాబాద్‌ హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్ ఓఆర్‌ఆర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (ROAD ACCIDENT) చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తానేదార్​పల్లి ఎంపీటీసీ దొంతం కవిత, ఆమె భర్త తెరాస నేత వేణుగోపాల్ రెడ్డి ఈ ఘటనలో మృతి చెందారు. గత నెల 22న తమ కూతురు వివాహం వేడుకలు జరుపుకుని.. పనులు ముగిశాక అనంతరం వనస్థలిపురంలోని సహారా స్టేట్స్‌లోని తమ నివాసానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి పెద్దఅంబర్‌పేట్‌ వద్దకు రాగానే డివైడర్ వద్ద టిప్పర్ మూలమలుపు తీసుకుంటుండగా.. వేణుగోపాల్ దంపతుల వాహనం స్కార్పియోను టిప్పర్ వెనకాల నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. టిప్పర్ డ్రైవర్ పరాయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.