గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మలుపు వద్ద రెండు లారీలు స్వల్పంగా ఢీకొనగా.. ఇద్దరు డ్రైవర్లు కిందకు దిగి గొడవపడుతుండగా.. స్థానికంగా ఉండేవారు వీరిద్దరికి సర్దిచెప్పేందుకు వచ్చారు. వీరంతా రోడ్డుపైనే మాట్లాడుకుంటుండగా.. మరో సిమెంట్ లారీ వీరిపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయి వారు గామాలపాడుకు చెందిన సీతారామయ్య, జానిగా గుర్తించారు.
ఇదీ చదవండి: కొవిడ్తోనే రక్తం గడ్డకట్టే ముప్పు అధికం!