పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఉత్తర తమిళనాడు తీరం నుంచి దక్షిణ ఒడిశా వరకు ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావం వల్ల ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖాధికారి శ్రీకాంత్ వివరించారు. రాయలసీమలోనూ ఈరకంగానే ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: