కరోనా వ్యాప్తి నియంత్రణలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెదేపా విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ విమర్శించారు. క్వారంటైన్ సెంటర్స్‌లో వసతుల లేమి, ప్రభుత్వ వైఫల్యంపై విశాఖ తెదేపా కార్యాలయంలో ఆయన నిరసన చేపట్టారు. కరోనా బాధితులకు సరైన చికిత్స అందించటం లేదని ఆరోపించారు. క్వారంటైన్ సెంటర్స్‌లో భోజనం, మంచి నీళ్ల వసతి కూడా సరిగా లేవని దుయ్యబట్టారు. కరోనా పరీక్షలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: