ETV Bharat / city

సింహాచలం చందన దీక్షల తేదీలు ఖరారు - శ్రీనరసింహ దీక్షల వార్తలు

విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలో చేపట్టే చందన దీక్షల తేదీలు సింహాచలం దేవస్థానం ప్రకటించింది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులు దీక్షలు చేపట్టాలని దేవస్థానం ఈవో సూచించారు.

Chandana Deeksha dates announced simhachalam temple
సింహాచలం దేవస్థానం
author img

By

Published : Nov 25, 2020, 12:35 PM IST

విశాఖ సింహాచలంలోని సింహాద్రి అప్పన్న భక్తులు ప్రతి సంవత్సరం నియమ నిష్ఠలతో చేపట్టే శ్రీ నరసింహ దీక్షలు ఈ ఏడాది జరగనున్నాయి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులు దీక్ష చేపట్టాలని దేవస్థానం ఈవో సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి ఈ నెల 28న మాలాధారణ, వచ్చే ఏడాది జనవరి 8న దీక్ష విరమణ తేదీలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. భక్తులకు దేవస్థానం తరపున దీక్ష వస్త్రాలు, ఇతర సదుపాయాలు కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.

దీక్ష విరమణ రోజున మాల విసర్జన చేసిన భక్తులను మాత్రమే కొండపైకి అనుమతిస్తామన్నారు. ఆ రోజు సాధారణ భక్తులకు యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయని తెలిపారు. ఈసారి భక్తులకు దేవస్థానం తరపున మాల విసర్జన చేయడం జరగదని స్పష్టం చేశారు. దీక్షల విరమణ రోజున ఇరుముడి కొండపైన సమర్పణకు అవకాశం లేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి దంపతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.