కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా... రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు పూర్తిస్థాయిలో మూతపడ్డాయి. అయితే విజయవాడ సింగ్నగర్లో ఇద్దరు యువకులు కారులో తిరుగుతూ మద్యం సీసాలను అధిక ధరలకు విక్రయిస్తూ.. పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 253 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: