ETV Bharat / city

'ఆర్థిక పరిస్థితి అనారోగ్యంగా మాత్రమే ఉంది... మంచాన పడలేదు' - తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు తాజా న్యూస్

జగన్​ను నమ్మి ఓటేసిన... ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు పూర్తి మొత్తంలో ఇవ్వకపోవటం దారుణమని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనారోగ్యంగా మాత్రమే ఉందని... పూర్తిగా మంచాన పడలేదన్నారు. రాష్ట్ర ఆదాయం... జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో లేదని స్పష్టం చేశారు.

tdp mlc ashok babu
'రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనారోగ్యంగా మాత్రమే ఉంది...మంచాన పడలేదు'
author img

By

Published : Apr 3, 2020, 10:14 AM IST

'రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనారోగ్యంగా మాత్రమే ఉంది...మంచాన పడలేదు'

రాష్ట్ర ఆదాయం... జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో లేదని ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టం చేశారు. జగన్ తన సొంత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు... ఉద్యోగుల జీతాలు ఆపడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 4.50 లక్షల ఉద్యోగులు, పెన్షనర్లు జగన్ ను నమ్మి ఓట్లేశారన్న అశోక్ బాబు...సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంపు విషయంలో ఇంతవరకు వారికిచ్చిన హామీని జగన్ నెరవేర్చలేదని విమర్శించారు.

తెలుగుదేశం ప్రభుత్వంలో ఉద్యోగులకు 43శాతం ఫిట్ మెంట్ కు ఒప్పించి తీసుకున్నామని గుర్తు చేశారు. కరోనా తీవ్రతలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉద్యోగులు ఉన్నారన్న అశోక్ బాబు...జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం వెనక్కి వెళుతోందని మండిపడ్డారు. జగన్ ఇచ్చిన జీవో కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికేనని ఆరోపించారు. తక్షణమే జీవోను ఉపసంహరించుకుని అందరికీ మొత్తం జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:

'కాంట్రాక్టర్లకు రూ.6400 కోట్లు.. ఉద్యోగులకు వేతనాల్లో కోతలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.