గుర్రం జాషువా హృదయ వేదనను 'గుర్రం జాషువా పద్య చంద్రిక' పుస్తకం ద్వారా రచయిత డాక్టర్ గుమ్మా సాంబశివరావు అందించటంపై రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో జరిగిన పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న ఆయన.. జాషువా సాహిత్యం మొత్తాన్ని పద్య చంద్రిక పుస్తకం ద్వారా డాక్టర్ సాంబశివరావు అందించారని ప్రశంసించారు.
కవికోకిల జాషువా సాహిత్యం సమాజంలోకి మరింతగా వ్యాపించాలని ఆకాంక్షించారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వ తరపున అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. 'గుర్రం జాషువా పద్య చంద్రిక' తరహా పుస్తకాలు సమాజంలోకి వస్తున్నంత కాలం తెలుగు భాష మనుగడకు ఢోకా ఉండదని యార్లగడ్డ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: CM Jagan Tweet: 'అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం పాటుబడిన నవయుగ కవి చక్రవర్తి జాషువా'