Skill Development Corporation case: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో ఏ1గా ఉన్న గంటా సుబ్బారావు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సోమవారం వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీనిపై సుబ్బారావు తరఫు న్యాయవాది ఆదినారాయణరావు అభ్యంతరం వ్యక్తం చేశారు.
డబ్బులు ఇచ్చిన వ్యక్తిని వదిలేసి, సంబంధం లేని వారిని కేసులో ఎలా పెడతారని నిన్న(డిసెంబర్15) ప్రశ్నించిన హైకోర్టు.. ఈ రోజు ఉదయానికి కౌంటర్ వెయ్యాలని ఆదేశించింది. ప్రభుత్వ తరపు న్యాయవాది మరింత గడువు కోరడంతో హైకోర్టు బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి: hc on skill development case: 'డబ్బులిచ్చిన అధికారిని నిందితుడిగా ఎందుకు పేర్కొనలేదు'