ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి అన్ని సంఘాల నేతలు హాజరయ్యారు. ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యవేదిక పేరిట నిర్వహించిన భేటీలో పలు కీలక అంశాలు చర్చించారు. ఎన్‌ఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ సహా పలు సంఘాల నేతలతో పాటు.. పీఆర్సీ సాధన సమితి ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి పీఆర్సీ సాధన సమితి సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఇవాల్టి భేటీలో సమ్మెకు కార్యాచరణ రూపొందించి ప్రకటించనున్నారు. ఇప్పటికే ఎన్‌ఎంయూ, ఈయూ సహా పలు సంఘాల మద్దతు తెలిపాయి.
సంబంధిత కథనాలు
- RTC IN STRIKE: "రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తాం"
- APSRTC Employee Unions: నేడు ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాల కీలక భేటీ
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!