తెల్లరేషన్ కార్డులు కలిగిన వారికి ఆర్థిక సాయం కింద ప్రభుత్వం పంపిణీ చేస్తున్న 1000 రూపాయల కోసం విజయవాడ నగరంలో పలువురు బారులు తీరారు. విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ కాలనీలోని వార్డు సచివాలయానికి నగదు కోసం తెల్లరేషన్ కార్డు దారులు క్యూ కట్టారు. ఉదయం ఓసారి నగదు కోసం నగర వాసులు భారీ ఎత్తున తరలిరాగా సర్వర్ పని చేయడం లేదని వార్డు సచివాలయం ఉద్యోగులు చెప్పారు. మధ్యాహ్నం మళ్లీ రావాలంటూ కూపన్లు ఇచ్చి తిప్పి పంపారు. వారు చెప్పిన సమయానికి మరోసారి మహిళలు పెద్ద ఎత్తున రాగా.... సచివాలయం మూసివేసి ఉంది. చేసేది లేక ఉద్యోగులు వచ్చే వరకు అక్కడే చెట్ల కింద ప్రజలు పడిగాపులు కాయాల్సి వచ్చింది. వాలంటీర్ల ద్వారా పలుచోట్ల ఇంటింటికీ నగదు పంపిణీ చేస్తున్నా....ఈ వార్డులో అలా లేకపోవటంతో కార్డుదారులు ఇలా సామాజిక దూరాన్ని సైతం పక్కన పెట్టి వెయ్యి రూపాయల కోసం ప్రమాదకరంగా బారులు తీరారు.
ఇదీ చదవండి: దీపాలు వెలిగించి సమైక్యతను చాటాలి: సీఎం జగన్