ETV Bharat / city

పండుగ వేళ ఉద్యోగులకు అందని జీతాలు.. పని చేయని కొత్త సాఫ్ట్​వేర్​

No salaries for Employees: ఉగాది పండుగకు కూడా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. ఆర్ధికశాఖ ఇటీవల తీసుకువచ్చిన పేరోల్ హెర్బ్ వెబ్.. రిజర్వు బ్యాంకుతో అనుసంధానం కాకపోవడంతో జీతాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో మళ్లీ పాత విధానంలోనే వేతనాలు చెల్లించేందుకు బిల్లులను అప్‌లోడ్ చేస్తున్నారు. ఆర్థిక శాఖ నిర్వాకంతో పండగ పూట కూడా జీతాలు రాలేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

No salaries for government employees
No salaries for government employees
author img

By

Published : Apr 2, 2022, 3:54 AM IST

Updated : Apr 2, 2022, 6:09 AM IST

పండుగ వేళ ఉద్యోగులకు అందని జీతాలు.. పని చేయని కొత్త సాఫ్ట్​వేర్​

No salaries in AP: ప్రభుత్వ ఉద్యోగులెవరికీ ఏప్రిల్ నెల మొదటి తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీతాలను చెల్లించలేకపోయింది. సాంకేతిక సమస్యల వల్లే జీతాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. గతంలో పాత విధానంలో హెచ్​ఆర్​ఎంఎస్​ ద్వారా ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం చెల్లించేది. సీఎఫ్​ఎంఎస్​ ద్వారా రిజర్వు బ్యాంకుకు ఆ వివరాలు వెళ్లి ఉద్యోగుల ఖాతాలకు వేతనాలు జమ అయ్యేవి. గత డిసెంబరు నుంచి హెచ్​ఆర్​ఎంఎస్​ను నిలిపివేశారు. కొత్త పీఆర్సీ అమలును ఏప్రిల్ 1 నుంచి పేరోల్‌ హెర్బ్ అనే వెబ్ ద్వారా వేతనాలు చెల్లింపులు జరుగుతాయని ఆర్ధిక శాఖ ప్రకటించింది.

అయితే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుగుతుండగానే పేరోల్‌ హెర్బ్ ద్వారా 2022 జనవరి వేతనాలను చెల్లించేశారు. ఫిబ్రవరి వేతనాలు కూడా ఇదే తరహాలో ప్రభుత్వం చెల్లింపులు చేసేసింది. ప్రస్తుతం ఈ నూతన పేరోల్ హెర్బ్ రిజర్వు బ్యాంకుకు అనుసంధానం కాకపోవటంతో మార్చి వేతన చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో మళ్లీ పాత విధానం హెచ్​ఆర్​ఎంఎస్​ నుంచే వేతన బిల్లులను అప్లోడ్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

పెన్షనర్లకు మాత్రం సీఎఫ్​ఎంఎస్​ నుంచే ఆర్ధిక శాఖ చెల్లింపులు చేసింది. అవుట్ సోర్సింగ్ సహా ఇతర ఉద్యోగులకు సంబంధించిన వేతన బిల్లులు కూడా హెర్బ్ ద్వారానే చెల్లించాల్సి ఉండటంతో అవి కూడా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 4 తర్వాత 50 శాతం మందికి.. ఆ తర్వాత రెండ్రోజుల్లో మిగతా 50 శాతం మంది ఉద్యోగులకు వేతనాలు అందే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆర్థిక శాఖ చేసిన పనితో ఉగాది వేళ కూడా వేతనం అందకుండా పోయిందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: పంచాయతీ కార్యదర్శులకు సబ్‌రిజిస్ట్రార్ హోదా: రజత్ భార్గవ

Last Updated : Apr 2, 2022, 6:09 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.