ETV Bharat / city

RRR On CM Jagan: ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించే అంశాలు ఇవే: ఎంపీ రఘురామ - ఎంపీ రఘురామ తాజా వార్తలు

RRR On CM Jagan: ప్రధానితో భేటీ తర్వాత.. ప్రత్యేక హోదా, పోలవరంపై చర్చించామని సీఎం జగన్‌ ప్రకటించుకుంటారని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనకున్న సమాచారం మేరకు.. తన విషయంతోపాటు, బెయిల్ అంశంపై ప్రధానితో మోదీతో జగన్ మాట్లాడతారని ఎంపీ అభిప్రాయపడ్డారు.

ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించే అంశాలు ఇవే

author img

By

Published : Jan 3, 2022, 3:54 PM IST

MP RaghuRama On CM Jagan Delhi Tour: ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీ పర్యటనపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధానితో భేటీ తర్వాత.. ప్రత్యేక హోదా, పోలవరంపై చర్చించామని సీఎం జగన్‌ ప్రకటించుకుంటారని చెప్పారు.

అయితే.. తనకున్న సమాచారం మేరకు.. ప్రధానితో ముఖ్యమంత్రి మాట్లాడే విషయాలు వేరేనని అన్నారు. తన విషయంతోపాటు, ఆయన బెయిల్ అంశంపై మాట్లాడతారని అభిప్రాయపడ్డారు. సినిమా టికెట్ల ధరలపై.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను రఘురామకృష్ణరాజు తప్పుపట్టారు.

దిల్లీ చేరుకున్న సీఎం జగన్..
ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి దిల్లీ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో సీఎం భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​తోపాటు ఇతర మంత్రులతో సమావేశం కానున్నారు.

ఇదీ చదవండి :

CM DELHI TOUR: దిల్లీ చేరుకున్న సీఎం జగన్.. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.