'చంద్రబాబు కుటుంబాన్ని అంతమెుందించేందుకు కుట్ర' - chandrababu vishaka tour news
ఏపీలో రాక్షసపాలన సాగుతోందని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్ మీద వైకాపా కార్యకర్తలు దాడి చేస్తే పోలీసులకు బాధ్యత లేదా అని నిలదీశారు. సీఎంకు స్వలాభమే తప్ప.. ప్రజా క్షేమం పట్టడం లేదన్నారు. చంద్రబాబు కుటుంబాన్ని అంతమొందించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తెదేపా కార్యకర్తలు దాడికి దిగితే వైకాపా అంతం ఖాయమని హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా ఘటన బాధ్యులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.