ETV Bharat / city

వైకాపాకు.. లీగల్ సెల్ నాయకుడు ఒగ్గు గవాస్కర్ రాజీనామా!

వైకాపాకు.. పార్టీ లీగల్ సెల్ నాయకుడు ఓగ్గు గవాస్కర్ రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కృషి చేసిన వారికి పదవులు ఇస్తున్నారని ఆరోపిస్తూ.. రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

oggu gavaskar resigns from ysrcp
oggu gavaskar resigns from ysrcp
author img

By

Published : Aug 28, 2021, 5:18 PM IST

విజయవాడ సెంట్రల్​ నియోజకవర్గంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ లీగల్ సెల్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది ఒగ్గు గవాస్కర్ రాజీనామా చేశారు. వైకాపా ఓటమికి కృషి చేసిన వారికి పదవులిచ్చి అందలం ఎక్కిస్తున్నారని ఆరోపించారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్లాది విష్ణు ఓటమికి పని చేసిన వ్యక్తులకు పదవులను కట్టబెట్టారన్నారు.

అందుకు నిరసనగానే.. తాను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. గత 20 ఏళ్లుగా ఎమ్మెల్యే విష్ణును నమ్ముకుని ఆయన గెలుపునకు తాను వీలైనంతగా కృషి చేస్తే.. ఇవాళ తనను పక్కన పెట్టారని గవాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యువజన, రాష్ట్ర లీగల్ సెల్ నాయకుడిగా పార్టీ కోసం ఎంతో కృషి చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఇదీ చదవండి:

Ex MP Butta Renuka: టిక్కెట్టు రాలేదు.. నామినేటెడ్ పదవీ దక్కలేదు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.