ETV Bharat / city

పెరిగిన చలి తీవ్రత.. కరోనా బారినపడి కోలుకున్న వారికి ఇబ్బంది

శీతాకాలం ప్రభావం విజయవాడ, గుంటూరు నగరాల్లో ఈసారి కొంచెం ఎక్కువగా ఉంది. కాలుష్య ప్రభావం తగ్గడం వల్ల చలి తీవ్రత గతంతో పోలిస్తే రెండు నగరాల్లోనూ పెరిగింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాత్రి వేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు తగ్గుతున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. డిసెంబరు నెలలోనే ఇలా ఉంటే.. జనవరి నాటికి చలి తీవ్రత మరింత పెరగనుంది.

Increased cold intensity
పెరిగిన చలి తీవ్రత కరోనా బారినపడి కోలుకున్న వారికి ఇబ్బంది
author img

By

Published : Dec 4, 2020, 12:57 PM IST

ప్రస్తుతం కరోనా ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటోంది. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు కృష్ణాలో నమోదవుతున్నాయి. రోజుకు వంద నుంచి 150 వరకు కేసులు కృష్ణాలో వస్తున్నాయి. గుంటూరులోనూ రోజుకు 70 నుంచి వంద కేసులొస్తున్నాయి. ప్రస్తుతం చలి తీవ్రత పెరుగుతున్న కొద్ది వైరస్‌ ప్రభావం మరింత ఎక్కువవ్వనుంది. ఇప్పటికే కరోనా బారినపడి కోలుకున్న వారికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మూడు నెలల్లో చలి తీవ్రత తగ్గేవరకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం చలితో పాటు తుపాన్ల ప్రభావం వల్ల చల్లని గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. చల్లని గాలిలోకి ఒక్కసారి వచ్చినా.. జలుబు, తలనొప్పి, దగ్గు లాంటి అనారోగ్య సమస్యల బారినపడతారని, కరోనా బారినపడి కోలుకున్న వారికి ఇది మరింత ప్రమాదకరంగా మారుతోందన్నారు. ● కరోనా చికిత్స కోసం హైపవర్‌ యాంటీబయాటిక్స్‌, స్టెరాయిడ్స్‌ను వినియోగిస్తారు. వీటి ప్రభావంతో శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గడంతో పాటు ఊపిరితిత్తులకు సమస్య ఉంటుంది. చలిగాలిలో బయటకు రావడం వల్ల వీరు నిమోనియా బారినపడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.ఊపిరితిత్తులకు ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది.

ఆస్తమా, మధుమేహం, టీబీ, హెచ్‌ఐవీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్న వారికి ఈ వాతావరణం అంత మంచిది కాదు.

గాలికి దూరంగా.. ఏసీలు తక్కువగా..

చల్లని గాలి వీచే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఎంత చల్లగా ఉన్నా ఏసీలను పెట్టుకుని ఉండడం చాలా మందికి అలవాటు. అందుకే.. వీలైనంత తక్కువగా ఏసీలను వినియోగించడం మంచిది. ఉదయం వేళ ఎండలో కచ్చితంగా కొంత సమయం ఉండాలి. ఇప్పటికే జలుబు, వైరల్‌ జ్వరాల బారినపడి ఆస్పత్రులకు వస్తున్నవారి సంఖ్య గత వారం పది రోజుల్లోనే గణనీయంగా పెరిగింది. కరోనా లక్షణాలు కూడా ఇవే కావడంతో వెళ్లిన వారందరికీ ముందుగా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. ఫలితాలు వచ్చాకే వైద్యం అందిస్తున్నారు. అందుకే ముందే అప్రమత్తంగా ఉండడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ఫ్లూ, నిమోనియా బారిన...

కరోనా బారినపడినప్పుడు ఊపిరితిత్తులపైనే ప్రభావం అధికంగా ఉంటుంది. ఫ్లూ, నిమోనియా వంటి రెండో దశ ఇన్‌ఫెక్షన్ల బారిన తేలికగా పడేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటివాళ్లు ముందస్తుగా ఫ్లూ, నిమోనియా వాక్సిన్లను వేసుకోవాలి. కొవిడ్‌ వచ్చి తగ్గిన వాళ్లు వేసుకోవడం చాలా మంచిది. నిమోనియా బారినపడకుండా ఊపిరితిత్తులకు అదనపు రక్షణ ఉంటుంది. నిమోనియాకు మూడు నుంచి ఐదేళ్లకోసారి, ఫ్లూ వాక్సిన్లు ఏడాదికి ఒకసారి వేసుకోవాలి. ఆయాసం తీవ్రమవుతున్నా, కళ్లు పచ్చబడుతున్నా, గుండె వేగం పెరుగుతున్నా, జ్వరం వచ్చి వెళుతున్నా.. తప్పనిసరిగా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఆహారం ఆచితూచి..

శీతాకాలంలో వేడిగా ఉండే ఆహారం తినడం మంచిది. వేపుళ్లను పూర్తిగా తగ్గించాలి. వీలైనంత వరకు సూపుల రూపంలో తీసుకోవాలి. పండ్లను ఎక్కువగా తినాలి. ఈ మూడు నెలలు తప్పనిసరిగా గోరువెచ్చని నీళ్లనే తాగాలి. చేతులు, తినే కంచాలు కూడా గోరువెచ్చని నీటితో కడగడం వల్ల వైరస్‌ల బారినపడకుండా ఉంటారు.

అన్ని రకాల వైరస్‌లకు అనుకూలం

-కంచర్ల అనిల్‌కుమార్‌, శ్వాసకోశ వైద్య నిపుణులు

శీతాకాలం అంటేనే అన్ని రకాల వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్లకు అనుకూలంగా ఉండే కాలం. ఏటా కంటే ఈసారి మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. చల్లని గాలిలోకి రాకుండా ఉండడం, పోషకాహారం తీసుకోవడం అత్యావశ్యకమని గుర్తించాలి.

ఇవీ చూడండి...కరోనా కట్టడికి 50 రోజుల ప్రత్యేక కార్యచరణ: కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.