ETV Bharat / city

ELECTION FIGHTS: దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పలు చోట్లు ఉద్రిక్తతలు - ఎన్నికల వార్తలు

రాష్ట్రంలో కొన్ని చోట్ల నేడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వైకాపా నేతలు ఇతర ప్రాంతాలనుంచి జనాన్ని తీసుకొచ్చి దొంగఓట్లు వేస్తున్నట్లు తెదేపా, భాజపా ఆరోపిస్తున్నాయి. పోలీసులు వారికి సహకరిస్తున్నారని వారు అంటున్నారు.

ELECTION FIGHTS
ELECTION FIGHTS
author img

By

Published : Nov 15, 2021, 3:51 PM IST

గుంటూరు నగరపాలక సంస్థ 6వ డివిజన్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. నగరంలోని కొత్తపేట ఏరియాలోని జలగం రామారావు పాఠశాల, గొలుసు కొండలరావు పాఠశాల, ఉమెన్స్ మహిళా కళాశాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వృద్ధులు సైతం పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. డివిజన్​లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి వైకాపా నేతలు, కార్పొరేటర్లు వెళ్లి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులు ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 16వ డివిజన్​లో 1, 2 పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపా నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ.. పలువురి గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆటోల్లో బయటి ప్రాంతాల నుంచి ఓటింగ్ కేంద్రాలకు వస్తున్న వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వైకాపా, తెదేపా నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి పోలీసులు అదుపు చేయలేకపోయారు. పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని 14వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార పార్టీ నేతలు, భాజపా నాయకులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలో వైకాపా అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటూ భాజపా నిరసన వ్యక్తం చేస్తుంది. పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించిన భాజపా నేతలు ఆందోళనకు దిగారు. దీంతో వైకాపా, భాజపా నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు ఇరువర్గాలను అక్కడ నుంచి పంపించేశారు.

అనంతపురం నగరంలో 17వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద భాజపా నేతలు ఆందోళన చేపట్టారు. వైకాపా నేతలు ఇష్టానుసారంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. దీనికి పోలీసులు వత్తాసు పలుకుతూ ఓటర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. పోలీసులు దగ్గరుండి వైకాపా నేతలను ప్రోత్సహిస్తూ దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో పోలీసుల తీరు సరిగాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో భాగంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ 17వ వార్డులో పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్తుండగా పెనుకొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అడ్డుకున్నారు.

ఇదీ చదవండి: ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి.. ఇన్ని కుట్రలా? - చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.