దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శైలజానాథ్ మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ప్రజల బాధలు, కష్టాలు పట్టట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 21రోజుల నుంచి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని.. దీనికి కళ్లెం వేయాలని సూచించారు.
ఓవైపు కరోనా, మరోవైపు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పెరిగన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి...