పన్నులు, విద్యుత్తు ఛార్జీల పెంపుపై కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌ను నిలదీసిన మహిళల తెగువ అందరికీ స్ఫూర్తి కావాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆదివారం ట్వీట్ చేశారు. ‘ప్రజల జేబులు గుల్ల చేసిన డబ్బులతోనే సంక్షేమం అంటూ మోసం చేస్తున్న వైనంపై గళమెత్తిన సోదరీమణుల ఆవేదనకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుంది? జగన్ జేబులోంచి ఇచ్చారా.. అసలు దోచింది ఎంత.. ఇచ్చింది ఎంత.. మేము వాటితో బతుకుతున్నామా.. అంటున్న ఆడబిడ్డల ప్రశ్నలకు ప్రభుత్వం ఏం చెబుతుంది? ప్రభుత్వ మోసాన్ని, తమ కష్టాన్ని వివరిస్తూ ప్రశ్నించిన వారి తెగువ స్ఫూర్తిదాయకం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పత్రికా కథనం, వీడియోను షేర్ చేశారు.
-
పన్నుల బాదుడు, పెంచిన కరెంట్ చార్జీల పై ఎమ్మెల్యేలను సైతం రోడ్డున నిలదీస్తున్న ఆ మహిళల ధైర్యానికి వందనం. తమ జేబులు గుల్ల చేసిన డబ్బులతోనే సంక్షేమం అంటూ తమను మోసం చేస్తున్న వైనం పై గళ మెత్తిన సోదరీమణుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం ఇవ్వగలదా?(1/2) pic.twitter.com/GLACMD7yZv
— N Chandrababu Naidu (@ncbn) May 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">పన్నుల బాదుడు, పెంచిన కరెంట్ చార్జీల పై ఎమ్మెల్యేలను సైతం రోడ్డున నిలదీస్తున్న ఆ మహిళల ధైర్యానికి వందనం. తమ జేబులు గుల్ల చేసిన డబ్బులతోనే సంక్షేమం అంటూ తమను మోసం చేస్తున్న వైనం పై గళ మెత్తిన సోదరీమణుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం ఇవ్వగలదా?(1/2) pic.twitter.com/GLACMD7yZv
— N Chandrababu Naidu (@ncbn) May 1, 2022పన్నుల బాదుడు, పెంచిన కరెంట్ చార్జీల పై ఎమ్మెల్యేలను సైతం రోడ్డున నిలదీస్తున్న ఆ మహిళల ధైర్యానికి వందనం. తమ జేబులు గుల్ల చేసిన డబ్బులతోనే సంక్షేమం అంటూ తమను మోసం చేస్తున్న వైనం పై గళ మెత్తిన సోదరీమణుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం ఇవ్వగలదా?(1/2) pic.twitter.com/GLACMD7yZv
— N Chandrababu Naidu (@ncbn) May 1, 2022
కష్టాల్లో కార్మిక లోకం: రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్నవి పవర్ హాలిడేలతో సరిగా నడవటం లేదని, దీంతో కార్మిక లోకం తల్లడిల్లిపోతోందని ఆదివారం చంద్రబాబు ట్వీట్ చేశారు. శ్రామికులు, కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ‘పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు. తెదేపా హయాంలో పరిశ్రమల స్థాపనతో లక్షలమంది ఉపాధి పొందారు. కానీ నేడు కార్మికులకు కనీసం ప్రమాద బీమా ఇవ్వలేని పరిస్థితి. ఇప్పటికైనా కార్మికులంతా ఒక్కతాటిపైకొచ్చి ప్రభుత్వ తిరోగమన విధానాలపై పోరాడాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం మేడే వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు మేడే జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ డి.రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఏం జరిగిందంటే..?
కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వ పథకాల పంపిణీ సందర్భంగా.. స్థానిక మహిళలు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఓవైపు నిత్యావసరాల ధరలు పెంచుతూ.. మరోవైపు పథకాల చెక్కులు పంపిణీ చేయడం ఏంటని తిరగబడ్డారు. గూడూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సున్నా వడ్డీ మూడో విడత చెక్కు పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది.
"నూనె ధర, గ్యాస్ ధర ఆకాశాన్నంటాయి. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం కూడా సరిగా లేవు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా.. ప్రభుత్వ పథకాలు ఎందుకు? ఈ పథకాలతో లాభాలు ఏం లేవు. ప్రజలకు కనీసం ఇల్లు కట్టించి ఇవ్వాలి. నగర పంచాయతీలో తాగడానికి కనీసం నీటిని సక్రమంగా ఇవ్వడం లేదు. ఇష్టమొచ్చినట్లు పన్నుల భారం ప్రజలపై విధిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారు" అని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు.
ఇదీ చదవండి: తల్లి పాత్ర సరిగ్గా లేకుండా.. పోలీసులదే బాధ్యతంటే ఎలా?: హోంమంత్రి