లక్ష కోట్ల దోపిడీలో ఏ2 అయిన విజయసాయి రెడ్డిని జగన్ విచ్చల విడిగా ప్రజల మీదకి వదిలారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. కరోనా వచ్చాక విజయసాయిరెడ్డి మైండ్ పూర్తిగా పాడైందని విమర్శించారు. ఎంపీడీఓ సరళపై దాడి చేసిన కోటంరెడ్డికి జగన్ సన్మానం చేసిన ఘటన మర్చిపోయారా అని అయ్యన్న ప్రశ్నించారు. సొంత బాబాయ్‌ని లేపేసిన హంతకులను కాపాడటానికి అన్ని అడ్డదారులు తొక్కుతున్న జగన్ రెడ్డిలో పరివర్తన రావడం అసాధ్యమని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: ప్యాకేజీ ఇవ్వకుండా వెళ్లమంటే ఎక్కడికి వెళ్తారు? : చంద్రబాబు