దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్(ఏఐసీఎఫ్ )కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అన్యాక్రాంతమైన క్రైస్తవ మిషనరీ ఆస్తులను తిరిగి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏఐసీఎఫ్ 25వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏఐసీఎఫ్ నూతన జాతీయ కార్యదర్శి ఏలీయా, ఉపాధ్యక్షుడు రాబర్ట్ సన్ మాట్లాడారు.
దళిత బౌద్ధ, సిక్కుల వలే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించి రాజ్యాంగ భద్రతా చేకూర్చాలని ఏలీయా కేంద్రాన్ని కోరారు. రాజ్యాంగంలోని 25వ ఆర్టికల్ ప్రకారం దేశంలోని అన్ని మతాలను సమానంగా చూడాలన్న నిబంధనను ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని ధ్వజమెత్తారు. మతం మారితే కులం మారదన్న సుప్రీం కోర్టు తీర్పు ను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. తమ మిషనరీ ద్వారా విద్య, వైద్యానికి సంబంధించిన సేవలు అందిస్తామని తెలిపారు.
అన్యాక్రాంతమైన ఏఐసీఎఫ్ ఆస్తులను తిరిగి అప్పగించాలని రాబర్ట్ సన్ ప్రభుత్వాన్ని కోరారు. మిషనరీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: Assigned Lands: అసైన్డ్ భూముల కమిటీల ఏర్పాటుపై మంత్రి ధర్మాన సమీక్ష