తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఈవోగా ఇటీవల నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం తిరుపతికి చేరుకున్నారు. విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన ఆయన.. రోడ్డు మార్గం ద్వారా తిరుపతి పద్మావతి వసతి గృహానికి వచ్చారు. జవహర్ రెడ్డికి తితిదే ఇన్ఛార్జ్ ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. జేఈఓలు బసంత్ కుమార్, భార్గవి, సీవీఎస్ఓ గోపీనాథ్ జెట్టి, తితిదే బోర్డు సభ్యులు చెవిరెడ్డి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.
నేడు ఆయన కాలినడకన తిరుమల చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుమల ఆలయంలో ఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.