ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్‌వో గోపినాథ్‌జెట్టి పరిశీలించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 23న రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి...24న ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలసి స్వామివారిని దర్శిచుకుంటారు. అనంతరం నాదనీరాజన వేదికపై నిర్వహించే సుందరకాండ పారాయణంలో పాల్గొని...ఈవో వసతి సముదాయం శంఖుస్థాపన కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు.
ముఖ్యమంత్రులు పర్యటించే బేడి ఆంజనేయస్వామివారి ఆలయం నుంచి శ్రీవారి ఆలయం వరకు భద్రతను పెంచారు. ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. నాదనీరాజనం వేదికపై భద్రత, అలంకరణ, కార్యక్రమం నిర్వహించాల్సిన తీరుపై చర్చించారు.
ఇదీచదవండి
'శ్రీవారి పట్ల విశ్వాసం లేనివారే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది'