తిరుపతిలో అపహరణకు గురైన ఛత్తీస్గడ్కు చెందిన ఆరేళ్ల బాలుడు శివకుమార్ సాహు సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విజయవాడ బస్టాండ్ పరిసరాల్లో బాలుడిని గుర్తించి.. చైల్డ్ లైన్ అధికారులకు అప్పగించామన్నారు. తిరుపతి అర్బన్ పోలీసులకు, బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు చెప్పారు.
అలిపిరి బస్టాండ్ వద్ద గత నెల 27న శివకుమార్ అపహరణకు గురయ్యాడు. అప్పటి నుంచి తిరుపతి అర్బన్ పోలీసులు బాలుడి కోసం అన్వేషిస్తున్నారు. వి.కోట ప్రాంతానికి చెందిన శివప్ప కిడ్నాపర్ అని.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. బాలుడిని విజయవాడలో వదిలి కిడ్నాపర్ పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. తల్లిదండ్రులు ధ్రువీకరించిన తర్వాత చైల్డ్ లైన్ అధికారులు తిరుపతి అర్బన్ పోలీసులకు బాబుని అప్పగించనున్నారు.
ఇదీ చదవండి: తిరుపతిలో బాలుడి అపహరణ కేసులో పురోగతి