తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ(svvu) ప్రాంగణంలో చిరుత కదలికలు(Leopard wandering in SV Veterinary University campus) విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం వెనుక భాగంలో మూత్ర విసర్జనకు వెళ్లిన ఓ వ్యక్తి(డ్రైవర్)పై దాడికి చిరుత యత్నించడంతో వర్సిటీ సిబ్బంది వణుకుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన సిబ్బంది.. డమ్మీ తుపాకితో కాల్పులు జరిపి చిరుతను బెదరగొట్టారు.
మూడు రోజుల క్రితం అఖిలభారత పందుల పరిశోధన స్థానం వద్ద కనిపించిన చిరుత.. శనివారం బాలికల వసతి గృహం వద్ద సంచరిస్తూ.. విద్యార్థుల కంటపడింది. ఇది నెల రోజుల నుంచి ఇక్కడే సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. విశాలమైన శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఆవరణలో మొత్తం ప్రహరి నిర్మించడంతో బయటికి వెళ్లలేక చిరుతు ఇబ్బందిపడుతూ.. అక్కడే ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులు రాత్రివేళల్లో బయటకు వెళ్లొద్దని అధికారులు(Chirutha wandering at svvu) హెచ్చరించారు.
ఇదీ చదవండి..
TIRUMALA: ఆన్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు.. అరగంటలోపే ఖాళీ