ETV Bharat / city

తితిదే బోర్డులో నేర చరితుల నియామక పిటిషన్​పై హైకోర్టులో విచారణ వాయిదా - తిరుపతి వార్తలు

TTD
తితిదే బోర్డులో నేర చరితుల నియామక పిటీషన్​పై హైకోర్టులో విచారణ వాయిదా
author img

By

Published : Oct 6, 2021, 1:36 PM IST

Updated : Oct 7, 2021, 2:35 AM IST

13:31 October 06

TTD : తితిదే బోర్డులో నేర చరితుల నియామక పిటీషన్​పై హైకోర్టులో విచారణ వాయిదా

అధికార పార్టీతో నేరుగా రాజకీయ సంబంధాలు , క్రిమినల్ కేసులున్న కొందరిని తితిదే పాలక మండలి సభ్యులుగా నియమించడాన్ని సవాలు చేస్తూ భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి నాయకుడు , తితిదే మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు జి.భానుప్రకాశ్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది . 18 మంది సభ్యుల పేర్లను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చాలన్న పిటిషనర్ అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించింది . వారిని ప్రతివాదులుగా చేర్చింది . విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది .  

ఇదీ చదవండి :      

TIRUMALA TIRUPATHI BRAHMOTHSAVALU: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేటి సాయంత్రమే అంకురార్పణ

Last Updated : Oct 7, 2021, 2:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.