ETV Bharat / city

'ఓటేయలేదంటూ కరెంట్​, నీరు నిలిపేశారు.. అధికారులు పట్టించుకోవడం లేదు'

తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో వైకాపా మద్దతుతో పోటీ చేసి గెలిచిన సర్పంచ్.. తమను ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాము ఆయనకు ఓటు వేయలేదన్న కోపంతో.. కరెంటు, నీటి సరఫరా నిలిపేశారని ఆవేదన చెందారు. ఉన్నతాధికారులకు చెప్పినా సమస్య పరిష్కారం కావడం లేదంటూ.. మీడియాకు గోడు వెళ్లబోసుకున్నారు.

sapanch cuts power, water to villagers for not voting to him
తనకు ఓటేయలేదంటూ సర్పంచ్​​ దాష్టీకం
author img

By

Published : May 12, 2021, 5:34 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని రాయవరం గ్రామస్తులైన కొందరు... తమకు త్రాగు నీరు, విద్యుత్​ వసతులను గ్రామసర్పంచ్​ నిలిపివేయించారని ఆరోపిస్తూ.. మీడియాను ఆశ్రయించారు. వైకాపా బలంతో విజయం సాధించిన ఆయన​.. ఎన్నికల్లో తాము ఓటు వేయలేదన్న ఆరోపణలతోనే ఇలా చేస్తున్నారని ఆవేదన చెందారు.

గత 10 రోజులుగా గ్రామంలోని.. సుమారు 30 కుటుంబాలకు విద్యుత్, త్రాగునీరు నిలిచిపోయిందని చెప్పారు. సమస్యను పరిష్కరించాలని ఇప్పటికే పలు సార్లు అధికారులను ఆశ్రయించినా.. ఎటువంటి స్పందనా లేదంటున్నారు. కరోనా కారణంగా బయటకు రాలేని పరిస్థితులను అనువుగా మార్చుకుని.. రాజకీయంగా తమను వేధిస్తున్నారని సీపీఐఎంఎల్​ నేత గణేశ్​ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

'ఇవర్​మెక్టిన్'​ డ్రగ్ పంపిణీకి మరో రాష్ట్రం సిద్ధం

కొవిడ్ బాధితుల కోసం.. ఆర్యవైశ్య సంఘం ఆక్సిజన్ సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.