నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన మెుబైల్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్లను కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. అనుమసముద్రం, దువ్వూరు, గ్రామాల్లో మొబైల్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్‌ను ప్రారంభించారు. కొవిడ్ పరిస్థితుల్లో వికలాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇబ్బందులు పడకుండా మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇంటి వద్దకే వెళ్లి పోస్టల్ బ్యాలెట్ విధానంలో వృద్ధులు, వికలాంగులతో ఓట్లు వేయించారు. ఇంటి వద్దకే వెళ్లి ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక బృందాలతో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియను ఆయన వివరించారు.
ఇదీ చదవండి: రివర్స్ పాలనకు రివర్స్ ట్రీట్‌మెంట్.. ఆ రోజు దగ్గర్లోనే ఉంది: చంద్రబాబు