రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అప్రమత్తంగా లేకుంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని కోరారు. క్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్లలో భోజనాలు సరిగా లేవన్నారు.
మందులు కూడా సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం జగన్ ఒక్కసారైనా సంబంధిత కేంద్రాలను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా... ఎందుకు సరిగా వినియోగించడం లేదని ప్రశ్నించారు. కొవిడ్‌తో చనిపోయిన వారికి పది లక్షల రూపాయలను ఇవ్వాలని కోరినా ప్రభుత్వం స్పందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: