ETV Bharat / city

రాజస్థాన్​లో లోన్​ యాప్​ ముఠా సభ్యుడి అరెస్టు.. - రాజస్థాన్​కు చెందిన లోన్​ యాప్​ముఠా సభ్యుడుఅరెస్ట్

Lone App gang member arrest: లోన్​ యాప్​ వేధింపులపై పోలీసులు దృష్టిసారిస్తున్నారు. తాజాగా లోన్​యాప్​ ముఠాకు సంబంధించిన రాజస్థాన్​కు చెందిన ఓ వ్యక్తిని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

arrested Lone App gang member
లోన్​ యాప్​ ముఠా సభ్యుడు అరెస్ట్
author img

By

Published : Oct 15, 2022, 4:08 PM IST

Lone App gang member arrest: లోన్ యాప్ ద్వారా ప్రజలను వేధింపులకు గురి చేస్తూ.. మోసం చేస్తున్న రాజస్థాన్​కు చెందిన అంతర్జాతీయ ముఠా సభ్యుడిని వైఎస్ఆర్ కడప జిల్లా సీకె దిన్నే పోలీసులు అరెస్ట్ చేశారు. పది రోజుల కిందటే ఆరుగురు లోన్ యాప్ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు... వారిచ్చిన సమాచారం మేరకు రాజస్థాన్​కు వెళ్లి జాన్​ యాదవ్ అనే నిందితున్ని అరెస్ట్ చేశారు. జాన్ యాదవ్ బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తే దాదాపు 20 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలిందని జిల్లా ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు. ఈ ముఠా సభ్యుడు హంకాంగ్​లోని ఇద్దరు ఘరానా మోసగాళ్లకు ఈ లోన్ యాప్ డబ్బులు పంపిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ పేర్కొన్నారు. హాంకాంగ్​లోని ఇద్దరు ముఠా సభ్యుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.