ETV Bharat / city

ఐదు అంతస్తుల భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్య - కడపలో యువతి ఆత్మహత్య తాజా వార్తలు

అమ్మా నన్ను క్షమించు.. అని చేతిపై రాసుకుని ఓ యువతి ఐదు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడపలో జరిగింది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
author img

By

Published : May 30, 2020, 10:56 PM IST

కడప పోలీస్​ స్టేషన్​ పరిధిలో విషాదం జరిగింది. అమ్మా నన్ను క్షమించు.. అని చేతిపై రాసుకుని ఓ యువతి ఐదు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

కడప మరాఠీ వీధికి చెందిన కవిత ఇంటర్మీడియట్ పరీక్షలు రాసింది. కొద్ది రోజుల నుంచి ఓ వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియటంతో రోజూ తల్లిదండ్రులతో గొడవ పెట్టుకునేది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఇంట్లో నుంచి బయటికి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. అనంతరం మరాఠీ వీధి సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఆమంచి, కరణం బలరాం వర్గీయుల మధ్య ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.