గుంటూరు జిల్లాలో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత పరామర్శించారు. బాధిత కుటుంబానికి 5 సెంట్ల స్థలం పత్రాలను అందజేశారు. రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పిన ఆమె.. త్వరలో ఆమె సోదరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం 5 ఎకరాల సాగు భూమి ఇవ్వనున్నట్లు తెలిపారు.
రమ్య హత్యోదంతం బాధాకరమని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. హత్య కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. కొన్ని ఆధారాలు దొరికాయి.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సుచరిత చెప్పారు.
ఇదీ చదవండి: LETTER TO NHRC: ఎన్హెచ్ఆర్సీకి తెదేపా నాయకుల లేఖ..ఎందుకంటే..!