గుంటూరు సర్వజనాస్పత్రిలో మృతదేహాలు పేరుకుపోయిన అంశం కలకలం రేపిన వేళ... అధికారులు చర్యలు చేపట్టారు. మార్చురీలోని 45 మృతదేహాల్లో 21 కరోనా వైరస్ ప్రభావిత మృతదేహాలే ఉన్నాయి. వీటిని తీసుకెళ్లేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో... జిల్లాలో ఆయా ప్రాంతాల తహసీల్దార్లకు మృతదేహాల తరలింపు బాధ్యతలు అప్పగించారు. రంగంలోకి దిగిన వారు... కుటుంబ సభ్యులతో మాట్లాడి మృతదేహాలను తీసుకెళ్లేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేక బ్యాగులో చుట్టి జిప్ వేసి అప్పగించడం సహా... అంత్యక్రియల్లో చేపట్టాల్సిన జాగ్రత్తలను వివరించారు. బంధువులెవరో తెలియని మృతదేహాలను పోలీసులు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది ఖననం చేయనున్నారు.
ఇదీ చూడండి..